top of page

సి.ఎం సహాయనిది లబ్ధిదారుల చెక్కుల పంపిణీ లో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Mar 28, 2022
  • 1 min read

పేదలకు వరంలా ముఖ్యమంత్రి సహాయనిది - లబ్ధిదారుల చెక్కుల పంపిణీ లో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు.

రైల్వే కోడూరు నందు ఈరోజు సాయంత్రం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహయనిది వరంలా బాధితులకు ఉపయోగ పడుతోందని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈరోజు మధ్యాహ్నం రైల్వేకోడూరు పట్టణం వైయస్సార్ సిపి కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహయనిది నుండి రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాల లబ్ధిదారులకు మంజూరైన రూ.36 లక్షల రూపాయల విలువగల 72 చెక్కులను లబ్దిదారులకు అందచేశారు.

అనారోగ్యాలతో ఆర్థికంగా చితికిన తమకు ముఖ్యమంత్రి సహయనిది ద్వారా అండగా నిలిచిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కి, ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గార్లకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి, చిట్వేలు మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, ఎంపీపీ ధ్వజ రెడ్డి, జడ్పిటిసి రత్నమ్మ,మండల కన్వీనర్ సుధాకర్ రాజు,ఉప సర్పంచ్ తోట శివ సాయి, పట్టణ కన్వీనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page