top of page

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎండీ అరెస్ట్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 24, 2022
  • 1 min read

మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎండీ సి.పార్థసారథిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. ఇన్వెస్టర్లకు సంబంధించిన షేర్లను వారి అనుమతి లేకుండా, ఇన్వెస్టర్ల కు చెప్పకుండా కార్వీ స్టాక్ బ్రోకింగ్ తన ఖాతాల్లోకి మళ్లించుకుని, బ్యాంకుల నుంచి రుణాలు పొంది. ఆ రుణాలను పార్థసారథి తనకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థల్లోకి మళ్లించినట్టు ఆరోపణలు. కార్వీ తీసుకున్న రుణాల విలువ రూ.3,000 కోట్ల వరకు ఉంటుందని ఈడీ అంచనా వేస్తోంది.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page