top of page

228 కర్ణాటక మద్యం బాట్టిళ్లు పట్టివేత

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 2, 2022
  • 1 min read

కర్నూలు జిల్లా, కర్నూల్ శివారులోని పంచలింగాల అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఎస్ఈబి సీఐ మంజుల, ఎస్ఐ .రాముడు నేతృత్వంలో సిబ్బంది తనిఖీ చేస్తుండగా రాయచూరు నుంచి కర్నూల్ కి వస్తున్న కర్ణాటక బస్సులో కర్ణాటకకు చెందిన 288 ఒరిజినల్ చాయిస్ విస్కీ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలను ఆత్మకూరు మండలం కరివేన గ్రామం కు చెందిన బత్తుల సుశీలమ్మ దగ్గర నుండి స్వాధీనపరచుకున్నట్లు సీఐ వెల్లడించారు.తదుపరి చర్యల నిమిత్తం కర్నూలు ఎస్ఇ బి స్టేషన్ కు తరలించారు.ఈ తనిఖీలలో హెడ్ కానిస్టేబుల్ జగన్నాథం,గోపాల్ గౌడ్ కానిస్టేబుల్ మధుసూదన శాంతరాజు, శ్రీనివాసులు, లక్ష్మి SPO రంగస్వామి, గోపాలకృష్ణ పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page