top of page

కానాల ఈవెంట్స్ ఇక అందుబాటులోకి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 10, 2022
  • 1 min read

కానాల ఈవెంట్స్ ఇక అందుబాటులోకి

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

పట్టణంలోని హోమస్ పేట నందు నూతనంగా కాణాల ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ కార్యాలయాన్ని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డా. వై. స్వరూప్ కుమార్ రెడ్డి, ప్రముఖ కార్డియాలజిస్ట్ సింగం భాస్కర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలలో ఈవెంట్ మేనేజ్మెంట్ల కొరకు ప్రత్యేకంగా నిష్ణాతులైన ఈవెంట్ మేనేజర్లు ఉంటారని, కార్యక్రమాలకు ఏ విధమైన ఆటంకం కలుగకుండా, సకాలంలో పని ఒత్తిడి తగ్గించుకొనేందుకు సౌలభ్యం కలదని, అలాంటి ఈవెంట్ మేనేజ్మెంట్ ఇన్ని రోజులు పసిడిపురి ప్రొద్దుటూరులో లేదని, నేడు కాణాల ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ అధినేత కానాల శ్రీకాంత్ రెడ్డి సాహసోపేతంగా మన పట్టణానికి పరిచయం చేశారని, రాబోవు రోజుల్లో వివిధ శుభకార్యాలకు, కార్యక్రమాలకు, పెళ్లిళ్లకు, పుట్టినరోజు వేడుకలు, పార్టీలు, ఫంక్షన్లకు కణాల ఈవెంట్స్ ను సంప్రదించాలని వారు ఆశాభవం వ్వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్ మేనేజ్మెంట్ యాజమాని కాణాల శ్రీకాంత్ రెడ్డికి వారి శుభాకాంక్షలు తెలియచేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page