top of page

అభిషేక్ రెడ్డిని సన్మానించిన ముక్కా సాయి వికాస్ రెడ్డి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Sep 13, 2023
  • 1 min read

లెఫ్ట్నెంట్ కల్నల్ ముద్ధ అభిషేక్ రెడ్డిని సన్మానించిన ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ అధినేత తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి.

ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. మైలపల్లి గ్రామానికి చెందిన ముద్ద అభిషేక్ రెడ్డి (లెఫ్ట్నెంట్ కల్నల్)నీ సి.డి.ఎస్,అత్యంత పురస్కారం అందుకున్న సందర్భంగా బుధవారం మైలపల్లి గ్రామంలోని తన నివాసం నందు అభిషేక్ రెడ్డి తో పాటు, కుటుంబ సభ్యులైన తండ్రి ముద్ద రవి కుమార్ రెడ్డి, తల్లి రాధికా రెడ్డి దంపతులను సాయి వికాస్ రెడ్డి సత్కరించారు.


ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ అధినేత తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలలో సిడిఎస్ కు ఏకైక వ్యక్తిగా ముద్దా అభిషేక్ రెడ్డి ఎన్నికవ్వడం మండల వాసులకు ఎంతో గర్వకారణం అన్నారు.అభిషేక్ రెడ్డి పురస్కారం అందుకున్న నేపథ్యం లో పలువురు అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో ..ముద్ద తిరుమల రెడ్డి . ముద్ద లక్ష్మికర్ రెడ్డి,బత్తిన వేణుగోపాల్ రెడ్డి, పెంచల్ రెడ్డి, ముక్కావారి పల్లి సర్పంచ్ ఆరవ శ్రీధర్,సాలవ రమణ రాజు, శివా రెడ్డి, నవీన్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page