top of page

ఘనంగా ఎంపీ అవినాష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 27, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


కడప వైసీపీ పార్లమెంట్ సభ్యుడు వై.ఎస్ అవినాష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రొద్దుటూరులో వైసీపీ నాయకులు, ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. నేడు అవినాష్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా ప్రభుత్వ ఆసుపత్రి నందు వైసీపీ నాయకులు, అవినాష్ రెడ్డి అభిమానులు, కార్యకర్తల నడుమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కేక్ కట్ చేసి, రోగులకు బ్రెడ్, పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అతి పిన్న వయస్సులోనే వైసీపీ పార్టీ నుండి కడప ఎంపీగా రెండు దఫాలు అవినాష్ రెడ్డి ఎన్నిక అయ్యారని, అలుపెరగిని కృషి పట్టుదల కార్యదక్షత గల వ్యక్తిగా గుర్తింపు పొంది, నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, అహర్నిశలు అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా గౌరవ మర్యాదలు పొందారని, రాబోవు రోజుల్లో అవినాష్ రెడ్డి మరిన్ని ఉన్నతమైన పదవులు అలంకరించి అటు పార్టీకి ఇటు ప్రజలకు మరింత సేవ చేయాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ, పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ జింక విజయలక్ష్మి, కౌన్సిలర్లు గరిసపాటి లక్ష్మీదేవి, ఇర్ఫాన్ భాషా, ఎంపీపీ శేఖర్ యాదవ్, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పోతిరెడ్డి మురళి నాథ్ రెడ్డి, అవినాష్ రెడ్డి అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page