top of page

కేతంరెడ్డి వినోద్ రెడ్డి సస్పెన్షన్ ను ఖండిస్తున్నాం : జనసేన నాయకులు

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 13, 2023
  • 1 min read

కేతంరెడ్డి వినోద్ రెడ్డి సస్పెన్షన్ ను ఖండిస్తున్నాం : జనసేన నాయకులు

సమావేశంలో మాట్లాడుతున్న జనసేన నాయకులు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


నెల్లూరు జిల్లా జనసేన నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని రాజంపేట జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. రాజంపేట జనసేన అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన నాయకులు స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలోని నాయకులను కార్యకర్తలను తొలగించే అర్హత జిల్లా అధ్యక్షులకు గానీ, ఇన్చార్జీలకు గానీ లేదని అన్నారు. అలా తొలగించాల్సి వస్తే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఆ అధికారం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు భాస్కర పంతులు, వెంకటయ్య, శంకరయ్య, ఆచారి, చంగల్ రాయుడు, పోలిశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page