top of page

అవకాశం ఇస్తే అభివృద్ధి చూస్తారు - జనసేన

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 21, 2023
  • 1 min read

అవకాశం ఇస్తే అభివృద్ధి చూస్తారు - జనసేన

కరపత్రాలు పంపిణీ చేస్తున్న జనసేన నాయకులు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని, అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామని రాజంపేట జనసేన నాయకులు తెలియజేశారు. రాజంపేట జనసేన అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు శనివారం పవనన్న ప్రజా బాట 52వ రోజు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా జనసేన నాయకులు మండల పరిధిలోని ఊటుకూరు, కొండ్లోపల్లె, గాలి వారి పల్లె, సున్నపురాళ్లపల్లె తదితర గ్రామాలలో పర్యటించారు. జనసేన మేనిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలను గడప-గడపకు తిరిగి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ రాజకీయాలలోనూ, పాలకులలోను మార్పు రావాలని.. రాజకీయరంగంలో నేటి వరకు పేరుకుపోయిన కుళ్ళు, కుతంత్రాలను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం చేశారని తెలిపారు. అటువంటి నిబద్ధత కలిగిన వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు జడ్డా శిరీష, రేవతి, ప్రమీల, సరోజమ్మ, నాయకులు తాళ్లపాక శంకరయ్య, నరసింహులు, అంజి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page