top of page

చిట్వేలి లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డా బిఆర్ అంబేద్కర్ జయంతి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 14, 2022
  • 1 min read

చిట్వేలి లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డా బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు - అందరికీ ఆరాధ్యుడు అంబేద్కర్ అన్న జనసైనికులు.

చిట్వేల్ అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మండల జనసైనికులు ఘనంగా నివాళులర్పించారు...చిట్వేలు జనసేన పార్టీ నాయకులు మాదాసు నరసింహ మాట్లాడుతూ... భారతదేశ చరిత్రలో స్థిరంగా నిలిచిపోయే మహానుభావుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని.. ఈ దేశానికి దిశా నిర్దేశం చేసిన ఆ జ్ఞాన సంపన్నుడి 131వ జయంతి సందర్భంగా నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన ఆయనకు కు ప్రణామాలు అర్పిస్తున్నామన్నారు.

పురం సురేష్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడు నిత్య ఆరాధనీయుడనీ.. ఈనాడు మన దేశం ఆర్థికంగా,సామాజికంగా వర్ధిల్లుతూ ఉందంటే అందుకు కారణం అంబేద్కర్ అని అన్నారు. కంచర్ల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా...ప్రపంచ గొప్ప మేధావుల్లో ఒకరిగా ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన అంబేద్కర్ భారతీయుడిగా జన్మించడం భారతీయులందరూ చేసుకున్న అదృష్టం అన్నారు.

పగడాల శివ మాట్లాడుతూ అనుభూతి మాటల్లో సామాజిక న్యాయం అందరికీ సమానంగా అందాలని అంబేద్కర్ ప్రస్తావించినా ఆదేశిక సూత్రాలు అనుగుణంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అన్నారు. షేక్ రియాజ్ మాట్లాడుతూ ఆయన చూపిన మార్గాన్ని సదా అనుసరిస్తూ నాదైన సేవలు ఈ దేశ ప్రజలకు అందిస్తానని ఈ పుణ్యదినం సందర్భంగా ఆయనకు జేజేలు అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో చిట్వేలి జనసేన పార్టీ నాయకులు మాదాసు శివ, కొనిశెట్టి ప్రసాద్, పసల సుబ్బు,నానబల సుభాష్,హేమంత్ రెడ్డి, కడుమురి నాగరాజు, కొనిశెట్టి చక్రి, పసల శివ, ఆనందల తేజ,నాగిశెట సురేష్, సువ్వారపు భాను, సువారపు హరి,పవన్ రాజు,షేక్ సోను, పగడాల శివరాం, పగడాల భరత్ సునీల్,శంకర, మాదినేని హరి, కళ్యాణం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page