top of page

ఓపెన్ జిమ్ కు శంకుస్థాపన చేస్తున్న 64 వార్డు జనసేన కార్పొరేటర్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 11, 2022
  • 1 min read

పెదగంట్యాడ (ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి) GVMC 64వ వార్డు పరిది యాతపాలెం గ్రామంలో 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి అధ్వర్యంలో ఓపెన్ జిమ్ శంకుస్థాపన కార్యక్రమం చేయటం జరిగింది.

కార్పొరేటర్ గోవిందరెడ్డి మాట్లాడుతూ కార్పొరేటర్ గా గెలిచి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా వార్డు అభివృద్ధి కానుకగా ఇచ్చిన 5 లక్షల రూపాయల నిధులతో యాతపాలెం గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయటం జరుగుతుందని గ్రామ ప్రజలు అందరూ జిమ్ ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమం లో జోనల్ కమిషనర్ శ్రీధర్, వైయస్ఆర్సిపి గాజువాక ఇన్చార్జ్ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి, గ్రామ ప్రెసిడెంట్ సమ్మంగి అప్పల నాయుడు, గోడ్డు కన్నరావు, గ్రామ కమిటీ సభ్యులు, పెద్దలు, మహిళలు, gvmc సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొనటం జరిగింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page