top of page

"జైల్ భరో" గోడపత్రిక ఆవిష్కరణ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 4, 2022
  • 1 min read

స్టీల్ ప్లాంట్ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13వ తారీకు "జైల్ భరో" కార్యక్రమం గోడ పత్రికను విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు ఈరోజు కర్మాగారంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ ప్రతినిధులు జె.అయోధ్య రామ్, గంధం వెంకట్రావు, కె.సత్యనారాయణ రావు మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తారీకు నాటికి నిరాహారదీక్ష శిబిరం ప్రారంభించి సంవత్సరకాలం పూర్తవుతున్న సందర్భంగా ఫిబ్రవరి 13వ తారీఖున పెద్ద ఎత్తున జైల్ భరో కార్యక్రమం ద్వారా తమ నిరసనను తెలియజేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ ప్రతినిధులు వైటి దాస్, వై మస్తానప్ప, గణపతి రెడ్డి, బొడ్డు పైడిరాజు, కొమ్మినేని శ్రీనివాస్, వరసాల శ్రీనివాస్, సిహెచ్ సన్యాసిరావు, డి.సురేష్ బాబు, ఉగ్రం, డి.వి రమణ రెడ్డి, జి.ఆర్.కె నాయుడు, డేవిడ్, మహాలక్ష్మి నాయుడు, పరంధామయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page