top of page

జగనన్న విద్యా కానుక విద్యార్థులకు వరం. పంపిణీలో ఉమామహేశ్వర్ రెడ్డి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 5, 2022
  • 1 min read

పట్టుదలతో చదివి భావి పౌరులుగా ఎదగాలి జగనన్న విద్యా కానుక పంపిణీలో ఉమామహేశ్వర్ రెడ్డి.



అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈరోజు ఉదయం జగనన్న విద్యా కానుకను ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఏబీఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.



ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్వేలు గ్రామ ఉపసర్పంచ్ చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి పాల్గొని తన చేతుల మీదుగా జగనన్న విద్యా కానుకను పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేశారు. తాను మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద, మధ్య తరగతి వారిని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులకు పిల్లల చదువులో ప్రభుత్వం భాగస్వామిగా నిలవాలన్న సంకల్పంతో ప్రవేశపెట్టిన జగనన్న విద్యాకానుక,అమ్మవడి లాంటి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఉన్నత భావి పౌరులుగా ఎదగాలని తల్లిదండ్రులకు కీర్తి తేవాలని కోరారు.



ఈ కార్యక్రమంలో పీఈటి డేవిడ్ ప్రసాద్ ఉపాధ్యాయులు యుగంధర్,దుర్గరాజు, పసుపుల రాజశేఖర్, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page