top of page

జగనన్న సురక్ష... ఆరోగ్యానికి రక్ష..!!

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Sep 30, 2023
  • 1 min read

జగనన్న సురక్ష... ఆరోగ్యానికి రక్ష..!!

ఎల్వి మోహన్ రెడ్డి ,ఉమామహేశ్వర్ రెడ్డి

జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మన అందరి ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని వైసీపీ సీనియర్ నాయకులు ఎల్ వి మోహన్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి లు అన్నారు. శనివారం చిట్వేలి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సచివాలయం 2 పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.కుటుంబంలోని ప్రతి వ్యక్తి అనారోగ్య లక్షణాలను గుర్తించి సరైన ఆరోగ్యాన్ని అందించే దిశగా రాష్ట్ర ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య రక్షణను అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వారన్నారు. అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు మందులను బాధితులకు అందిస్తారని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వారు తెలిపారు.

వైద్యులు డాక్టర్ అన్సారీ, సాల్మా పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శిరీష, ఎంపీడీవో శివరాం రెడ్డి, ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి, ఎంపీపీ చంద్ర, సర్పంచ్ బాలు, ఆరోగ్య, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page