పక్కా గృహాల నిర్మాణాలను పరిశీలించిన మునిసిపల్ చైర్మన్
- VOICE OF HERALD

- Apr 27, 2022
- 1 min read
పులివెందుల లోని నవరత్నాలలో భాగంగా పేదలందరికీ పక్కా గృహాలు అందించాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న హౌసింగ్ కాలనీ నందు నిర్మిస్తున్న పక్కా గృహాల నిర్మాణాలను పరిశీలించిన మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్.

నాణ్యత లో రాజీ లేకుండా నిర్మాణాలను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు తెలియ చేశారు, కార్యక్రమం లో హౌసింగ్ డైరెక్టర్ గంగల వీరా, కౌన్సిలర్ లు పార్నపల్లి కిషోర్, రాజశేఖర్ రెడ్డి, కో ఆప్షన్ చంద్రమౌళి, హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Comments