top of page

జగనన్న కు చెబుదాం లో సమస్యల వెల్లువ

  • Writer: EDITOR
    EDITOR
  • Sep 27, 2023
  • 1 min read

జగనన్న కు చెబుదాం లో సమస్యల వెల్లువ

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్.
సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్

. జాయింట్ కలెక్టర్ కు సమస్యలతో స్వాగతం పలికిన నందలూరు వాసులు.


. రెవెన్యూలో భారీగా అర్జీలు


. ఇచ్చిన అర్జీలను పరిష్కరించడం లేదని ఎమ్మార్వో పై ఫిర్యాదులు.


. ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు సోమవారం లోపల పరిష్కరించాలని జెసి ఆదేశాలు జారీ.


. కార్యక్రమం చివరి వరకు స్టేజ్ పైన నిలబడి ఉన్న తహసిల్దార్, ఎంపీడీవో

అర్జీలు ఇస్తున్న ప్రజలు

నందలూరు మండలం ఎంపీడీవో కార్యాలయం పరిధిలో ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని కి అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ మరియు రాజంపేట రెవిన్యూ డివిజనల్ అధికారి లో పాల్గొన్నారు. మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. తాహసిల్దార్ కార్యాలయంలో ఎన్ని అర్జీలు ఇచ్చిన పట్టించుకోవడం లేదని, తమ భూములకు డి ఫారం లు, పాస్ బుకులు ఉన్న వాటిని వేరే వాళ్లు అక్రమించారని చెప్పినప్పటికీ దానిపై ఎమ్మార్వో స్పందించలేదని ఫిర్యాదులు రావడంతో జాయింట్ కలెక్టర్ ఎమ్మార్వో ని పిలిచి వారిపై సోమవారం లోపల పూర్తిచేసి తమకు నివేదిక పంపాలని చెప్పడం జరిగింది. ఇంటి స్థలాలు చాలా వరకు మంజూరు చేయలేదని కూడా అర్జీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ మేడా విజయ భాస్కర్ రెడ్డి, జిల్లా మరియు డివిజన్, మండల అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page