తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాదులో
- VOICE OF HERALD

- Dec 4, 2022
- 1 min read
దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో

దేశంలోని తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ బేగంపేటలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో డెబిట్, క్రెడిట్ కార్డులతో 0.5, 1, 2, 5, 10, 50, 100 గ్రాముల బంగారు నాణేలు డ్రా చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. కాగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఏటీఎం స్కీన్పై కనిపిస్తాయి. మరోవైపు ఈ ఏటీఎంలను నగరంలోని పలు ప్రాంతాలతో పాటు వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు.




Comments