అక్రమ చెరువు మట్టి రవాణాపై విచారణ జరపాలి సి హెచ్ చంద్రశేఖర్.
- DORA SWAMY

- May 22, 2022
- 1 min read
చెరువు మట్టి అక్రమ రవాణాపై విచారణ జరపాలి బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలి. సిపిఎం డిమాండ్!

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం జిల్లెల్ల మడక చెరువులో మట్టి అక్రమ రవాణా జరుగుతోందని తక్షణం దీనిపైన విచారణ జరిపి బాధ్యులైన అధికారులపైనా కాంట్రాక్టర్ పైనచర్య తీసుకోవాలని, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు
సిహెచ్ .చంద్రశేఖర్, సిపిఎం మండల కన్వీనర్ ఏం జయరామయ్య విలేకర్ల సమావేశంలో డిమాండ్ చేశారు.

పేద రైతులు పంట పొలాలకు, చెరువు మట్టి అడిగితే అనుమతులు ఇవ్వడం లేదని, వ్యాపారం చేసుకునేందుకు ఇటుకుల బట్టి లకు, ప్లాట్లకు అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. జిల్లెల, మడక చెరువుకు ఒక వ్యాపారస్తుడు అనుమతుల కోరగా, మే 9వ తేదీన అనుమతులు ఇచ్చారని, ఆరు రోజుల్లో, 495 క్యూబిక్ మీటర్లకు అనుమతి ఇచ్చారు. ఆ పేరు చెప్పి, రెండు వారాల నుంచి, నేటికీ, రాత్రి పగలు, రెండు జెసిపి హిటాచీ లు, 30 టిప్పర్లు, అక్రమ రవాణా జరుగుతుందని తెలిపారు.
ఒక టిప్పు మూడు వేలకు, అమ్ముతున్నట్లు ,ఈ విషయం సిపిఎం జిల్లా నాయకులు, సి హెచ్ చంద్రశేఖర్, స్థానిక ఎమ్మార్వో కు ఫిర్యాదు చేశారని, పట్టించుకోకపోవడంతో, రాజంపేట ఆర్ డి ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అనుమతులు ఉన్నాయని అధికారులు గుడ్డిగా నమ్మారు, గడువు తీరిపోయిన విషయాన్ని గుర్తు చేయడం జరిగినది. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో చెరువు మట్టి తరలించాల్సి ఉందని, ఈ రెండు వారాల్లో అధికారులు అందుబాటులో లేరని, ఫిర్యాదు చేసిన తర్వాత, ఇరిగేషన్ జేఈఈ, శనివారం మార్కింగ్ ఇవ్వడం జరిగినది. మొదట్లో ఎందుకు మార్కింగ్ ఇవ్వలేదు అధికారులు నిద్రపోయారా అని ప్రశ్నించారు.

ఇచ్చిన పర్మిషన్ గడువు ఆరు రోజులు మే 14 కి తీరిపోయింది, 495 క్యూబిక్ మీటర్లు మించి వేలాది మీటర్లు, అక్రమంగా తరలిస్తున్నారు. ఇరిగేషన్ ,రెవెన్యూ అధికారులు ముడుపులు తీసుకొని, అక్రమ రవాణా కొనసాగుతూ ఉన్న చూసీచూడనట్లు అనుమతి ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే అధికార పార్టీ అండతో ఇసుక మాఫియా జరుగుతోందని, ఆఖరికి చెరువు మట్టి కూడా అధికార పార్టీ అండతో మాఫియా జరుగుతుందని ఆరోపించారు. ఇరిగేషన్ అధికారులు, చెరువు కబ్జా అవుతున్నా, తమకేమీ పట్టనట్లు బాధ్యతారహితంగా, వేలాది రూపాయలు జీతం తీసుకుంటూ నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు.

తక్షణమే విజిలెన్స్ కమిటీ చేత విచారణ జరపాలని, బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని, అక్రమ రవాణా చేస్తున్న కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేసి, ఎన్ని క్యూబిక్ మీటర్లు అక్రమ తవ్వకాలు జరిపారు, రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.



Comments