అనధికార గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న మాజీ శాసనసభ్యురాలు
- VOICE OF HERALD

- May 23, 2022
- 2 min read
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రాఘవాపురం గ్రామం వద్ద అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమ గ్రావెలింగ్ త్రవ్వక ప్రాంతమైన రాఘవాపురం గట్టును తెదేపా నేతలతో కలిసి ఆకస్మికంగా గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య.
గ్రావెల్ తవ్వకాల వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. తంగిరాల సౌమ్య ని దేశం పార్టీ కార్యకర్తలను చూడగానే పరారైన జెసిబి డ్రైవర్లు, లారీ డ్రైవర్లు.
తంగిరాల సౌమ్య మాట్లాడుతూ
రాత్రికి రాత్రే అక్రమార్జనే ధ్యేయంగా అధికార పార్టీ నాయకులు వేలకొద్ది ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారు. గతంలో పలుమార్లు అక్రమ మైనింగ్ పై ఎమ్మార్వోకి మైనింగ్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం నిరసన తెలియజేయడం జరిగినది.
మైనింగ్ ఏడీ అక్రమ గ్రావెలింగ్ జరుగుతున్నదని తెలియపరిస్తే ఫేక్ మెసేజ్ లు అంటూ అధికార పార్టీ నాయకులిచ్చే అమ్యామ్యాలకు బాగా అలవాటు పడి ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారని, రోజుకి 700లకు పైగా మట్టి లారీలు తోలుతున్నమని సంఘటన స్థలంలో నిందితులు చెబుతున్నారు. అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలి. దీనిపై పూర్తి వివరణ ఇచ్చేవరకు కదిలేదే లేదని తెదేపా శ్రేణులతో కలిసి జేసీబీ ముందు ధర్నాకు కూర్చున్న మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య.
మైనింగ్ అధికారులు, రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించాలి. అక్రమ గ్రావెలింగ్ పై పూర్తి వివరణ వచ్చే వరకు కదిలేదే లేదు తంగిరాల సౌమ్య. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు ఈ అక్రమ గ్రావెలింగ్ కు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ అక్రమ గ్రావెలింగ్ ను అరికట్టే వరకు దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. నందిగామ నియోజకవర్గంలోని అధికార పార్టీ నాయకుల దెబ్బకు ప్రజలు ఉక్కిరిబిక్కిరయిపోతున్నారని ఆమె అన్నారు. మట్టి కనపడితే చాలు మేసేయడమే అన్న దుస్థితికి వచ్చారు అని వ్యాఖ్యానించారు.
మైనింగ్ ఏడి నందిగామకు వచ్చినప్పటినుండి ఎన్నో అక్రమ త్రవ్వకాలు జరిగాయి గుడిమెట్ల, రాఘవాపురం, కొంగర మలై గట్టు ఇలా చూస్తూ పోతే ఇంకా ఏడి లిస్టులో ఎన్నున్నాయో జిల్లా అధికార యంత్రాంగమే సమాధానం చెప్పాలని, అంతే కాకుండా త్రవ్వకాల దగ్గరుండి ఫోన్ చేసినా ఎదైనా ఉంటే ఆఫీస్ కి వచ్చి మాట్లాడండి అంటారు. ఆఫీస్ కి వెళ్ళి చూస్తే అక్కడ ఉండరు. ఆఫీస్ వద్దనుండి ఫోన్ చేస్తే మీ ఫోన్లకు రిప్లై ఇవ్వడానికి మాకు టైం లేదని, వచ్చే వరకు ఉంటే ఉండండి లేకపోతే లేదని ఇష్టానుసారంగా మాట్లాడుతారు. అసలు ఎక్కడికి పోతుంది మైనింగ్ వ్యవస్థ మాకెలాగో సమాధానం చెప్పడం లేదు కనీసం మీ జీతాలకు పన్నులు కట్టే ప్రజలకైనా చెప్పాలనారు
నూతనంగా ఏర్పడిన నందిగామ ఆర్డీఓ ఆఫీసు కు ఇప్పుడు జరుగుతున్న అక్రమ గ్రావెల్ త్రవ్వకాలకు మూడు కిలోమీటర్ల దూరం కూడా ఉండదు అలాంటిది పెద్దఎత్తున అక్రమ మట్టి త్రవ్వకాలు జరుగుతున్నా ఆర్డీఓ ఎందుకు స్పందించడంలేదని ప్రతిపక్ష నాయకురాలు ప్రశ్నించారు. అంతే కాకుండా తెరవెనుక ఉన్న గాలి జనార్థన్ రెడ్డి లాంటి మట్టి మాఫియా డాన్ కి త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారని మాజీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు.


