top of page

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థి గుండెపోటుతో మృతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 5, 2022
  • 1 min read

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థి గుండెపోటుతో మృతి

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న వెంకట సాయి శంకర్ అనే విద్యార్థి గుండె పోటు తో మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థి స్వగృహం కడప జిల్లా బి. కోడూరు మండలం గోవిందపురం కు చెందిన వాడు. మృతదేహాన్ని ట్రిపుల్ ఐటీ అంబులెన్స్ లో వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవికరించారు.


ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం ఫ్రెండ్స్ తో కలిసి వ్యాయామం చేసేందుకు వెళ్లాడని తెలపారు. వ్యాయామం చేసి వస్తున్న సమయంలో ఆ విద్యార్థికి గుండె నొప్పి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. హుటాహుటిన సమీపంలోని వారి స్నేహితులు అతన్ని స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలిస్తుండగా నంది మండలం వద్ద కు వెళ్లగానే పల్స్ పడిపోవడంతో నంది మండలం ఆస్పత్రిలో చూపించినట్లు డైరెక్టర్ తెలిపారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలపారని దీంతో వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తీసుకొని వచ్చామని డైరెక్టర్ తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page