top of page

SBI సేవలపై విసిగిపోతున్నారా?

  • Writer: EDITOR
    EDITOR
  • Aug 2, 2022
  • 1 min read

SBI సేవలపై విసిగిపోతున్నారా?

నిర్లక్ష్యంగా ఉండే బ్యాంక్ ఉద్యోగులపై పిర్యాదు చేయండిలా...

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులా? బ్యాంక్ సేవ‌ల‌ పట్ల అసంతృప్తిగా ఉన్నారా? శాఖలో ఉద్యోగుల ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గా లేదా? అయితే, మీరు బ్యాంకుకు ఈ విష‌యాల గురించి ఫిర్యాదు చేయొచ్చు బ్యాంకులో ఖాతా తెరిచే వారు కూడా ఖాతా తెరిచే స‌మ‌యంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాటి గురించీ ఫిర్యాదుల‌ను రిజిస్ట‌ర్ చేయ‌వ‌చ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేసే సదుపాయం అందుబాటులో ఉంది.

ఎలా ఫిర్యాదు చేయాలి?

ఎస్‌బీఐ వెబ్‌సైట్ హోమ్ పేజ్‌లో అందుబాటులో ఉన్న కస్టమర్ కంప్లయింట్‌ ఫారంపై క్లిక్ చేయ‌డం ద్వారా ఫిర్యాదులు చేసే పేజీ ఓపెన్ అవుతుంది. లేదా(https://crcf.sbi.co.in/ccf/) వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా ఫిర్యాదు పేజీకి వెళ్లొచ్చు

ఇక్క‌డ రెండు బాక్సులు కనిపిస్తాయి. మొద‌టి బ్యాక్సులో కంప్లయింట్‌/రిక్వస్ట్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. ఇక రెండో బాక్సులో కొన్ని కేట‌గిరీలు అందుబాటులో ఉంటాయి. ఇందులో మీ కేట‌గిరీని ఎంచుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు మీరు వ్య‌క్తిగ‌త సెగ్మెంట్‌లో ఫిర్యాదు చేయాల‌నుకుంటే ఆ ఆప్ష‌న్ ఎంచుకోవాలి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page