top of page

కాంగ్రెస్‌లోకి త్రిష..? రాహుల్ జోడో యాత్రలో - కొత్త పాత్రలో..!

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 20, 2022
  • 1 min read

కాంగ్రెస్‌లోకి త్రిష..? రాహుల్ జోడో యాత్రలో - కొత్త పాత్రలో..!!

ప్రముఖ నటి త్రిష కృష్ణన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతోన్నారా?.. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోన్నారా?.. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సమాయాత్తమౌతోన్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చనే ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరుతారని చెబుతున్నారు.

రాజకీయాల్లోకి ప్రవేశించిన తమిళ నటీనటుల లిస్ట్ పెద్దదే. ఎంజీ రామచంద్రన్ మొదలుకుని ఖుష్బూ వరకు చాలామంది నటులు రాజకీయాల్లో అడుగు పెట్టారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత, కరుణానిధి, స్టాలిన్, విజయ్ కాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్, నెపోలియన్, ఉదయనిధి స్టాలిన్, విశాల్, ఖుష్బూ, సీమాన్.. ఇలా చాలామంది నటులు తమిళ రాజకీయాల్లో గుర్తింపు పొందారు.

ఇప్పుడు తాజాగా అదే జాబితాలో నటి త్రిష కూడా చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page