top of page

వర్షం ధాటికి నీట మునిగిన ఆధార్ సర్వీస్ సెంటర్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 15, 2022
  • 1 min read

వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు లో ఈరోజు తెల్లవాుజామున కురిసిన భారీ వర్షానికి కాలువలు పొంగిపోర్లగా రోడ్లన్నీ జలమయం అయ్యి సెల్లార్ లలో వర్షపు నీరు చేరి వ్యాపారస్తులు, వాహన యజమానులు భారీగా నష్టపోయారు.

ప్రొద్దుటూరు పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలకు గత కొద్ది సంవత్సరాలుగా ఆధార్ సేవలు అందిస్తూ, పలువురి మన్ననలు పొందిన కాన్పుల ఆసుపత్రి దగ్గరలోని ఎస్.వి.ఎస్ ఆన్లైన్ (ఆధార్ సర్వీస్) నిర్వహిస్తున్న పోరుమామిళ్ళ గురు స్వామి (గురు) కి వర్షం నీరు సెల్లార్ లో చేరటం వలన అపార నష్టం సంభవించింది. ఆన్లైన్ సేవలు నిర్వహించటానికి ఉపయోగించే మూడు కంప్యూటర్లు, ఒక లాప్టాప్, రెండు కలర్ ప్రింటర్లు, జిరిక్స్ మెషీన్, కలర్ కార్డ్ ప్రింటర్లు, పలు రకాల సర్వీస్ మెషీన్లు పూర్తిగా నీట మునిగి దాదాపు రెండు లక్షల రూపాయల మేర నష్టం సంభవించింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page