top of page

అక్రమంగా మట్టి తరలింపు కు భారీ జరిమానా

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 4, 2023
  • 1 min read

అక్రమంగా మట్టి తరలింపు కు భారీ జరిమానా

పట్టుకున్న అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ల

నందలూరు మండలం పరిధిలోని లేబాక గ్రామపంచాయతీ నందు ఉన్న చెరువు పరిసర ప్రాంతాల్లో అదే గ్రామానికి చెందిన కొంతమంది ఒక జెసిబి నాలుగు ట్రాక్టర్లతో అక్రమంగా మట్టిని రవాణా చేస్తున్న విషయం ఆదివారం మండల తాసిల్దార్ సత్యనందం దృష్టికి రాగా, ఆయన ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది పెళ్లి ఆ నాలుగు ట్రాక్టర్లను, జెసిబి ని పట్టుకొని తాసిల్దార్ కార్యాలయము నకు తరలించడం జరిగింది. సోమవారం ఉదయం తహసిల్దార్ వారిని విచారించి ఒక్కో ట్రాక్టర్ కి జరిమానా రూపాయలు 10,000/- మరియు జెసిబి కి రూపాయలు 50,000)- చొప్పున జరిమానా విధించడం జరిగిందని ఆయన తెలిపారు. పొలంలో అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమ రవాణాలు చేపడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తాసిల్దార్ సత్యానందం తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ మోహన్ కృష్ణ, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుశీల్ కుమార్, వీఆర్వోలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page