top of page

మార్కెట్లోకి టయోటా వారి హైరైడర్ మోడల్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 10, 2022
  • 1 min read

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ ఖాతరాబాద్ హర్ష టయోటా షోరూం నందు సోమవారం సాయంత్రం టయోటా కార్ల కంపెనీ వారి హై రైడర్ నూతన కార్ మోడల్ వేరియంట్ ను, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి లాంచనంగా ప్రారంభించారు.


ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ ముందుగా హర్ష టయోటా ప్రొద్దుటూరు శాఖ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. తనను ఆహ్వానించి నూతన కార్ వేరియంట్ను టెస్ట్ రైడ్ నిర్వహించిన ప్రొద్దుటూరు శాఖ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యాపార పరంగా దినదినాభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.


అనంతరం టయోటా షోరూం మేనేజర్ శివ మాట్లాడుతూ, గతంలో కూడా సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి చేతుల మీదుగా షో రూమ్ ప్రారంభించామని, నేడు తమ కంపెనీ ఉత్పత్తి నూతన వేరియంట్ మోడల్ హై రైటర్ కారును శివచంద్రారెడ్డి చేతుల మీదుగా టెస్ట్ రైడ్ చేయటం తమకెంతో సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. టయోటా ఉత్పత్తులలో హై రైడర్ కారు నూతన ఒరవడి సృష్టించనున్నదని, అటు డీజిల్ తో పాటు ఇటు బ్యాటరీతో నడవనున్న ఈ కారు, లీటర్ డీజిల్ కి దాదాపు 28 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనున్నదని, కారులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జిపిఎస్ ఆడియో సిస్టం కారు యొక్క ప్రత్యేకతని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి, పలువురు వార్డు మెంబర్లు హర్ష టయోటా ప్రొద్దుటూరు శాఖ ఉద్యోగులు, పలువురు టయోటా కార్ల యజమానులు పాల్గొన్నారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page