top of page

వేడుకగా హనుమాన్ శోభా యాత్ర బైక్ ర్యాలీ

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 6, 2023
  • 1 min read

వేడుకగా హనుమాన్ శోభా యాత్ర బైక్ ర్యాలీ

రాజంపేట: రాజంపేట పట్టణ కేంద్రంలో హనుమాన్ శోభా యాత్ర కార్యక్రమం గురువారం అత్యంత వేడుకగా నిర్వహించారు.విశ్వహిందూ పరిషత్,భజరంగ దళ్ నిర్వాహకులు వర్ధి బోయిన శ్రీధర్,పెంచల్ రెడ్డి,రెడ్డయ్య రాజు ఆధ్వర్యంలో మన్నూరు యలమ్మ ఆలయం నుంచి రైల్వే ఫ్లై ఓవర్ వంతెన వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా బీజేపీ పార్లమెంటరి స్పోక్స్ పర్శన్ సాయి లోకేష్,బీజేపీ రాజంపేట ఇంచార్జీ పోటుగుంట రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.ఈ బైక్ ర్యాలీ లో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.దారి పొడుగునా జై హనుమాన్, భారత్ మాతాకి జై,వందే మాతరం అంటూ వినాదాలతో హోరెత్తించారు. హిందూ మాత ప్రాస్యశ్యాని చాటి చెబుతూ తాము చేపట్టిన హనుమాన్ శోభ యాత్రా కు అనూహ్య స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులు వర్ధి బోయిన శ్రీధర్ తెలిపారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page