top of page

నవయుగ కవి చక్రవర్తి శ్రీ గుర్రం జాషువా గారి జీవితం నేటి యువతకు ఆదర్శం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 24, 2022
  • 1 min read

నవయుగ కవి చక్రవర్తి శ్రీ గుర్రం జాషువా గారి జీవితం నేటి యువతకు ఆదర్శం

తెలుగు సాహితీవనంలో పూసిన కవితాసుమం, మూఢాచారాలు పై తన కవిత్వంతో తిరుగుబావుటా ఎగురవేసిన కవిత చైతన్య దీప్తి శ్రీ గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా ఉక్కు నగరంలో సెక్టార్ 3 నందు గల జాషువా గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వై మస్తానప్ప గారు మాట్లాడుతూ కులం, మతం అంటూ సంకుచిత భావాలు కలిగిన సమాజంలో సామాజిక అసమానతలు నిర్మూలనకై, మూఢాచారాలపై తిరుగుబాటు, ప్రశ్నించే తత్వం, సగటు మనిషికి అర్థం చేసుకునే సరళమైన భాషలో హృదయానికి హత్తుకునే అనేక రచనల సమ్మేళనమైన గుర్రం జాషువా గారి జీవితం నేటి యువతకు ఆదర్శమని అన్నారు. చుట్టుగుళ్ల సుదర్శనం గారు మాట్లాడుతూ గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర వంటి రచనలతో జాతీయస్థాయిలో ప్రభావం చూపడమే కాక, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, పద్మభూషణ్ పురస్కారం ఇవ్వడంతోపాటు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా ప్రభుత్వం గౌరవించిందని అన్నారు.


ఈ కార్యక్రమంలో వై. మస్తానప్ప, చుట్టుగుళ్ల సుదర్శనం, కొత్తపల్లి సుబ్బారావు, చంద్రశేఖర్ శకునాల, అనపర్తి నవీన్, కరగన రామకృష్ణ, వంగూరు మహేష్, చొప్పర సురేష్,అత్తోట ప్రేమ్ కుమార్,మానేపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page