top of page

జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ప్రొద్దుటూరుకు చెందిన గుడిపాటి వెంకట సాయి సాకేత్ ఎంపిక

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 28, 2023
  • 1 min read

జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ప్రొద్దుటూరుకు చెందిన గుడిపాటి వెంకట సాయి సాకేత్ ఎంపిక.

గుడిపాటి వెంకట సాయి సాకేత్

కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీ చైతన్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గుడిపాటి వెంకట సాయి సాకేత్ అనే విద్యార్థి జాతీయస్థాయిలో క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల A.G.M నాగిరెడ్డి తెలిపారు. ఇటీవల మచిలీపట్నంలో అండర్-14 విభాగంలో S.G.F ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో అద్భుత ప్రతిభ కనపరచిన సాయి సాకేత్ ను జాతీయస్థాయికి ఎంపిక చేశారు. తాను జాతీయ స్థాయిలో ఎంపిక కావడానికి కారణమైన పాఠశాల A.G.M నాగిరెడ్డి, కోచ్ అహ్మద్ బాషా, తన తల్లిదండ్రుల కృషి మరువలేనిది అన్నారు. భవిష్యత్తులో ఇండియా టీం లో ఆడాలన్నదే తన కోరిక అని తెలిపారు. ప్రొద్దుటూరు త్రీ టౌన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న సాయి సాకేత్ తండ్రి వెంకటేశ్వర్లు తన కొడుకు ఇండియా టీం తరపున పాల్గొని జాతీయస్థాయిలో రాణించాలన్నదే తన కోరిక అన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page