top of page

గ్రీన్ ల్యాండ్స్ విల్లాస్ లో భోగి పండుగ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 14, 2023
  • 1 min read

Updated: Jan 15, 2023

గ్రీన్ ల్యాండ్స్ విల్లాస్ నందు భోగి పండుగ

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని గ్రీన్ ల్యాండ్స్ విల్లాస్ నందు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఉదయం భోగి పండుగ అత్యంత భక్తి శ్రద్హలతో ఆధ్యంతం కన్నుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి విల్లాస్ లోని ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు. ఇక్కడి ప్రజలు వారికి సాదర స్వాగతం పలికి పూలమాలలతో, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో గ్రీన్ ల్యాండ్ విల్లాస్ నందు ఇల్లు నిర్మించుకున్న వారికి అసౌకర్యం కలుగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం నిర్వహించిన ముగ్గుల పోటీలు, క్రీడల యందు గెలుపొందిన వారికి కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి సతీమణి శోభారాణి చేతుల మీదుగా బహుమతులు అందచేశారు. కార్యక్రమం నందు పెద్దఎత్తున గ్రీన్ ల్యాండ్స్ విల్లాస్ నందు నివసిస్తున్న ప్రజలు హాజరయ్యారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page