అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు పేదలకు భూ పంపిణీ జరగాలని సిపిఎం డిమాండ్.
- DORA SWAMY

- Jun 1, 2022
- 1 min read
అసైన్మెంట్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలి! పేదలకు భూమి పంచాలి .సిపిఎం డిమాండ్!!

వైసిపి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల జరుగుతూ ఉన్నా ఒక అసైన్మెంట్ కమిటీ సమావేశం కూడా జరగలేదని, సిపిఎం పార్టీ అన్నమయ్య జిల్లా నాయకులు సి హెచ్ చంద్రశేఖర్ రైల్వేకోడూరు విలేకర్ల సమావేశంలో డిమాండ్ చేశారు.
ఒక్క ఎకరా కూడా పేదలకు భూమి పంచ లేదని, ఉన్న ప్రభుత్వ భూమిని భూస్వాములు బోగస్ ఆన్లైన్లో చేసుకొని, అనుభవిస్తున్నరన్నారు. పేద వ్యవసాయ కూలీకి గాని దళితులకు గాని భూమి దక్క లేదన్నారు. భూమి కొనుగోలు పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఉన్న ప్రభుత్వ భూమిని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మకానికి పెట్టి 30 వేల కోట్ల రూపాయలు సంపాదించాలని ఆలోచిస్తున్నారని దీనితో పేదవాడికి భూమి దక్కదని ఈఆలోచన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక్క ఎకరా భూమిని పేదవారికి పంచ లేదన్నారు. అసైన్మెంట్ తో సంబంధం లేకుండా బోగస్ ఆన్ లైన్ లు చేసిన తాసిల్దార్ లను తక్షణం ఉద్యోగం నుంచితొలగించాలన్నారు. గత టీడీపీ ప్రభుత్వం లోనూ ప్రస్తుత వైసిపి ప్రభుత్వం లోను ఎమ్మార్వోలు కోట్ల రూపాయలు అక్రమ సంపాదన చేశారన్నారు. ఇప్పటికే ఓబులవారిపల్లి లో పనిచేసిన ఇద్దరు ఎమ్మార్వో లను ఉద్యోగం నుంచి తొలగించడం హర్షించదగ్గ విషయం అన్నారు. సాక్షాలతో దొరికిన ఎమ్మార్వో రోశయ్యతో సహా అనేక మంది తహశీల్దార్లు బోగస్ ఆన్లైన్ చేసిన తాసిల్దార్ ఉన్నారన్నారు. సమగ్రమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేకుంటే దీనిపైన ఆందోళన చేస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిగి .చెన్నయ్య, జిల్లా కార్యదర్శి పంది కాళ్ళ మణి, కెవిపిఎస్ డివిజన్ కన్వీనర్ ఓబిలీ .పెంచలయ్య గిరిజన సంఘం నాయకులు, బొజ్జా శివయ్య, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.



Comments