top of page

ఘనంగా మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంత రావు 25వ వర్ధంతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 22, 2022
  • 1 min read

ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు 25 వ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, జిల్లావ్యాప్తంగా ఉన్న అభిమానులు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుడు , ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన హనుమంతరావు తన స్వశక్తి తో వ్యాపార రంగంలోనూ , రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. రాజకీయాల్లో అన్ని పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాలు నెరపిన వ్యక్తి హనుమంతరావు. జిల్లా పరిషత్ చైర్మన్ గా, మంత్రి గా ప్రకాశం జిల్లా అభివృద్ధి లో కీలకమైన పాత్ర పోషించారు అని పేర్కొన్నారు. హనుమంతరావు వర్థంతి అద్దంకి, పర్చూరు, ఒంగోలలో ఆయన అభిమానులు పలు రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page