top of page

ఆ పార్టీ నియోజకవర్గ అభ్యర్థిత్వానికి గోసంగి పేరు పరిశీలన

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 8, 2024
  • 1 min read

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థిత్వానికి గోసంగి పేరు పరిశీలన

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వానికి గోసంగి వెంకటసుబ్బారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మర్యాదపూర్వకంగా కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని కోరినట్లు తెలియ వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన భేటీలో షర్మిల పలు ఆసక్తికర విషయాలు గోసంగితో చర్చించినట్లు సమాచారం. రానున్న ఎన్నికలలో తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే నియోజకవర్గంలో దాదాపు 15 వేల ఓట్లు కాంగ్రెస్ కు రానున్నట్లు, అయితే ఎన్నికల ప్రచారాలలో భాగంగా ప్రొద్దుటూరులో షర్మిల బహిరంగ సభ ఏర్పాటు చేస్తే మరో 15 వేల ఓట్లు కాంగ్రెస్ ఖాతాలో జమ కావచ్చునని ఆయన షర్మిలకు తెలియజేసినట్లు సమాచారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page