top of page

సేవాతత్వమే వారసత్వంగా తనయులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 9, 2022
  • 1 min read

తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్న తనయులు

ప్రొద్దుటూరు గోపికృష్ణ విద్యాసంస్థల వ్యవస్థాపకులు స్వర్గీయ కెవి రమణారెడ్డి ఆశయాలను తనయులు ప్రదీప్ రెడ్డి సందీప్ రెడ్డి లు కొనసాగిస్తూ 250 మంది నిరుపేదలకు నిత్యవసర సరుకులను మంగళవారం పంపిణీ చేశారు.


ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరికీ స్ఫూర్తిగా నిలిచిన స్వర్గీయ కె.వి.రమణారెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని రామేశ్వరం శివాలయం, అర్చన హాల్, నేతాజీ నగర్ 2వ వీధి , నడింపల్లి, శ్రీనివాస్ నగర్, నోకియా కేర్, నాగేంద్ర నగర్, ఆర్స్ కాలేజ్ రోడ్డు, మొడంపల్లి, మడూరు రోడ్ ప్రాంతాలలో నిత్యవసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి అభిమానులు జబీబుల్లా రాఘవేంద్ర రెడ్డి రవిశంకర్ గురు కుమార్ గౌస్ , గౌరీ శంకర్ గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page