top of page

స్వర్ణకారుల సంఘం సమావేశం, నూతన అధ్యక్షుని ఎన్నిక

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 18, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరులో ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ ఆదేశాల మేరకు పొద్దుటూరు పట్టణ స్వర్ణకారుల సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ నూరుల్లా, రాష్ట్ర స్వర్ణకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇలియాస్, స్వర్ణకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి అయూబ్ ఖాన్ అధ్యక్షతన స్థానిక సంఘం కార్యాలయంలో నూతన జిల్లా అధ్యక్షునిగా మురళీధర్ కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది, అలాగే ప్రభాకర్ ఆచారి అనారోగ్యం కారణంగా ఆయనకు ఎండి అయూబ్ ఖాన్ ఆర్థిక సహాయం చేశారు,, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ స్వర్ణకారులు నూరుల్లా చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక అధ్యక్షులు అమీర్ స్థానిక కార్యదర్శి భాష, ట్రెజరర్ దౌలా, ఖలీల్ భాషా, అన్వర్, నూరుల్లా, స్థానిక స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page