top of page

గో బ్యాక్ నారా లోకేష్ - రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 18, 2022
  • 1 min read

స్త్రీలను అఘోరపరిచిన వారికి మద్దతా - లోకేష్ పర్యటన ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు - ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి.

లోకేష్ పర్యటన అర్థరహితం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని, స్త్రీలను అగౌరవపరిచిన వారికి మద్దతుగా ప్రొద్దుటూరు రావడం, స్త్రీలను కించపరిచడమేనని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా మనసు రోదన వ్యక్తం చేస్తోందని, ఏ మహిళలనయితే అగౌరపరిచారో వారి ఇంటికి వెళ్లి లోకేష్ పరామర్శించడం రాజకీయంగా వారి విలువలను దిగజార్చడమేనన్నారు. మంగళవారం నాడు నారా లోకేష్ పర్యటన దృశ్య వైసీపీ పార్టీ మహిళా నాయకురాళ్లను, మహిళా సంఘాల నాయకురాళ్లను, కౌన్సిలర్లను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు. ప్రభుత్వంలో గత మూడేళ్లుగా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని పోలీసులు మా ప్రభుత్వంలో మారారు.కానీ గడిచిన 2014 నుండి 19 వరకు పోలీసులు వ్యవహరించిన తీరు మేము ఇంకా మర్చిపోలేదన్నారు. పోలీసుల తీరుపై అధికార పార్టీలో ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వంలో ఉన్న మాకు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇది మా ప్రభుత్వం ఉన్నట్టా, లేదా అని అనుమానం వ్యక్తం చేశారు.కానీ ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనన్నారు. నా నియోజకవర్గ అక్క చెల్లెళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేద్దన్నారు. కనుక మా నినాదం గో బ్యాక్ నారా లోకేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శేఖర్ యాదవ్,కల్లూరు నాగేంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page