top of page

'గిరిజన బంజారా జన సంఘ్' అవార్డుల పంపిణీ లో పాల్గొన్న కొరముట్ల

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Mar 5, 2022
  • 1 min read

ఈరోజు ఉదయం తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లోని శ్రీనివాస ఆడిటోరియం నందు జరిగిన గిరిజన బంజార జన సంఘ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు గిరిజన ప్రతిభా పురస్కార అవార్డులు, సాంస్కృతిక కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. తాను మాట్లాడుతూ ప్రతిభ వున్న పేద గిరిజన విద్యార్థుల ఎదుగుదలకు "గిరిజన బంజారా సంఘము" చేస్తున్న కృషి గణనీయమైనదని; అంతేకాక వైసీపీ ప్రభుత్వం పేద విద్యార్థుల ఎదుగుదలకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్, గిరిజన బంజార జన సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు హరి చౌహాన్ నాయక్, చంద్రశేఖర్ నాయక్ ,వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page