పారిశుధ్య కార్మికుల నిరవధిక సమ్మె
- VOICE OF HERALD

- Jul 11, 2022
- 1 min read
గాజువాక ప్రసన్న ఆంధ్ర విలేకరి
పారిశుధ్య కార్మికుల నిరవధిక సమ్మె

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు... యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3ఏళ్ళు అయినా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లో విఫలమయిందన్నారు ...కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించని యడల రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తాదనీ హెచ్చరించారు .... విజయవాడలో జరిగిన చర్చలు విఫలమవ్వడంతో సమ్మెకు దిగినట్లు తెలిపారు,,జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హెల్త్ అలవెన్స్ 6000/- రూపాయలు ఇవ్వాల్సి ఉండగా దాన్ని ఇవ్వకుండా జరుగుతుందన్న జాప్యం నేపథ్యంలో సమ్మె అనివారి అయ్యిందని అన్నారు..సమ్మెకు ప్రజలందరూ సహకరించాలని కోరారు , అలాగే వర్షాకాలం వచ్చిన సందర్భంగా వ్యాధులు ప్రబలితే దానికి రాష్ట్ర ప్రభుత్వం,అధికారులే బాధ్యత వహించాలన్నారు... యూనియన్ నాయకులు గొలగాని అప్పారావు,గణేష్,రమణ, రాము, రాణి, నాగరాజు, పారిశుధ్య కార్మికులు తదితరులు సమ్మెలో పాల్గొన్నారు.



Comments