top of page

శ్రీ భద్రకాళి అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 15, 2022
  • 1 min read

శుక్రవారం శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు.


---రాహుకాల దీపాలు వెలిగించిన మహిళలు.



అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం పాత చిట్వేలు గ్రామంలో వెలసియున్న శ్రీ వీరభద్ర సమేత భద్రకాళి అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ఈరోజు ఉదయం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి మృత్యుంజయ అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలతో అలంకరణ చేసి అభిషేకం, రాహుకాల పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఆలయ ధర్మకర్తలు తీర్థప్రసాదాలను అందించారు.




మండల పరిధిలోని మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించి రాహుకాల దీపాలను వెలిగించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page