top of page

ఫుడ్ పాయిజన్ 30 మంది పీజీ మహిళా విద్యార్ధినులకు అస్వస్థత

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 22, 2022
  • 1 min read

చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడియన్ యూనివర్సిటీ లోని ఈరోజు మధ్యాహ్నం మహిళా హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం మహిళా హాస్టల్లో భోజనం తిన్న 30 మంది పీజీ మహిళా విద్యార్ధినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. దీనికి పూర్తి బాధ్యత వార్డెన్ అని అంటున్నారు. సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు.


మరికొంతమంది పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు. అయితే ఏ సమాచారం బయటకు రానివ్వకుండా దాచిపెడుతున్నా కుప్పం ద్రవిడియన్ యూనివర్సిటీ అధికారులు. కుప్పం ద్రావిడ యూనివర్సిటీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కి గురైన విద్యార్ధినుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఆహారంలో నాణ్యత లోపం వల్ల అలా జరిగిందా? సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది విచారించాల్సి వుంది. దీనిపై స్పందించేందుకు అధికారులు ఎవరూ అందుబాటులో లేరు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page