జీవనజ్యోతి ఆనంద నిలయం అనాధలకు వరం. భోజన, దుస్తుల పంపిణీ లో ఉపాధ్యాయుడు నారాయణ.
- DORA SWAMY

- May 22, 2022
- 1 min read
జీవన జ్యోతి ఆనంద నిలయం అనాధలకు వరం
-ఆశ్రమం లో ఉన్నవారికి అన్నదానం,దుస్తులు పంపిణీ చేసిన తెలుగు ఉపాధ్యాయుడు నారాయణ
---అనాధలకు సేవ చేయడం నా అదృష్టం ఉపాధ్యాయుడు నారాయణ.

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లె మండలం రాళ్ల చెరువు పల్లి లో ఉన్న
జీవన జ్యోతి ఆనందనిలయం ఆశ్రమంలో నిర్వాహకులు పాణ్యం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెన్నరాజు పోడు లో తెలుగు ఉపాధ్యాయుడు గా విధులు నిర్వహిస్తున్న నారాయణ ఆశ్రమంలోని వృద్ధులకు, వికలాంగులకు,నిరాశ్రయులైన వారికి తన ఉదారత చాటుతూ చీరలు పంపిణీ చేసి,అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నారాయణ మాట్లాడుతూ ఓ మారుమూల గ్రామంలో జీవన జ్యోతి ఆనందనిలయం ఆశ్రమం ఏర్పాటు చేసిన సుబ్రహ్మణ్యంకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రులను తమ కన్న బిడ్డలే చూసుకోవడానికి కరువైన ఈ రోజుల్లో వృద్ధులకు, వికలాంగులకు,నిరాశ్రయులైన వారికి ఒక గూడు ఏర్పాటు చేసి, తన శక్తి మేర వారికి బాగోగులు చూసుకోవడం చాలా గొప్ప విషయమని, ఎవరైనా దాతలు సహకరిస్తే ఆశ్రమం అభివృద్ధికి దోహదపడుతుందని తెలియజేస్తూ, ఈ ఆశ్రమంలోని వారికి సేవ చేసుకోవడం నాకు ఎంతో తృప్తిగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

నిర్వాహకులు పాణ్యం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆశ్రమం ఉందని తెలుసుకొని ఇక్కడున్న వారికి చీరలు పంపిణీ చేసి, అన్నదానం నిర్వహించిన మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని, అదేవిధంగా ఆశ్రమ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ దోహదపడి ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.



Comments