సోఫా సెట్ దుకాణంలో అగ్నిప్రమాదం - ప్రొద్దుటూరు
- VOICE OF HERALD

- Apr 10, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు స్థానిక ఆశ్రమం వీధిలోని శివ కుమార్ సోఫా సెట్ దుకాణంలో ఈ మధ్యాహ్నం 03:15 నిమిషాలకు అగ్నిప్రమాదం సంభవించింది.
పండుగా రోజు మధ్యాహ్న సమయం కావటం చేత యజమాని తన దుకాణానికి తాళం వేసి భోజనానికి వెళ్లిన సమయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దుకాణంలో మంటలు చెలరేగి దట్టమయిన పొగ రావటం గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు, హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దుకాణ యజమాని లింగాల మునెయ్య అంచనా ప్రకారం మూడు లక్షల రూపాయలు విలువగల సోఫాలు, సామాగ్రి అగ్నికి ఆహుతి అయినట్లు తేలిపారు.



Comments