అగ్నికి ఆహుతి అయిన సవక చెట్లు
- EDITOR

- Mar 12, 2022
- 1 min read
Updated: Mar 13, 2022
ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని ఆత్మకూరు గ్రామంలో ఈరోజు సాయంత్రం పొలంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సవక చెట్లు దగ్దం అయ్యాయి.

గ్రామానికి చెందిన అమరనేని సురేష్ తన పొలంలో సవక చెట్లు పెంచుతున్నాడు. ఈరోజు సాయంత్రం జరిగిన షార్ట్ సిర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి మొత్తం దగ్ధం అయ్యాయి. బాధిత రైతు కథనం ప్రకారం ఇంకో 6 నెలల్లో కొట్టేందుకు సిద్ధంగా ఉన్న ఈ సమయంలో ఇలా జరగడం ఊహించ లేదని పేర్కొన్నారు.



Comments