top of page

ఫిల్లింగ్ స్టేషన్ భూమి పూజలో వైసిపి నాయకులు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Oct 26, 2022
  • 1 min read

పెట్రోల్ బంకు భూమి పూజోత్సవంలో పాల్గొన్న.. పాటూరి,బాబుల్ రెడ్డి,ఎల్ వి.

అన్నమయ్య జిల్లా చిట్వేలు గ్రామ పరిధిలోని నెల్లూరు రోడ్డు,అంబేద్కర్ సర్కిల్ వద్ద భారత్ కంపెనీ వారి సౌజన్యంతో పుల్లంపేట మండలం బాయికాడపల్లికి చెందిన నాగేశ్వర నాయక్ ప్రారంభిస్తున్న పెట్రోల్ బంకు భూమి పూజలోబుధవారం ఉదయం.. వైసీపీ సీనియర్ నాయకులు పాటూరి శ్రీనివాసులు రెడ్డి, పుల్లంపేట ఎంపీపీ బాబుల్ రెడ్డి,ఎల్ వి మోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు, కోడూరు రోడ్డు మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఈ ఫిల్లింగ్ స్టేషన్ సమీపంలో ఉండి అన్నివేళల సౌలభ్యంగా ఉంటుందని అన్నారు. త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలని నిర్వాహకులు నాగేశ్వర నాయక్ కు సూచించారు.

ఈ కార్యక్రమంలో చిట్వేలు మండల ఎంపీపీ చంద్ర, ఉప ఎంపీపీ సుబ్రహ్మణ్యం రెడ్డి, వైసీపీ యువ నాయకులు కరుణాకర్ రెడ్డి, సర్పంచులు చేతిపట్టు ప్రసాద్, సుబ్రహ్మణ్యం రెడ్డి,తుపాకుల బాలు, వడ్డిపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page