top of page

ప్రొద్దుటూరులో ఫెడరల్ బ్యాంకు సేవలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 28, 2022
  • 1 min read

ప్రొద్దుటూరులో ఫెడరల్ బ్యాంకు సేవలు

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రముఖ వాణిజ్య పట్టణమైన ప్రొద్దుటూరు లోని గది రోడ్డు నందు బుధవారం ఉదయం ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామ్ మోహన్ రావు, మునిసిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి లు సంయుక్తంగా నూతనంగా వెలసిన ఫెడరల్ బ్యాంకు ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. మునిసిపల్ కమిషనర్ రమణయ్య ఆ బ్యాంకు ఎటిఎం ను ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన ముఖ్య అతిధులు బుశెట్టి, బంగారు మునిరెడ్డి ముందుగా బ్యాంకు మేనేజర్ లోకేష్ కు శుభాకాంక్షలు తెలియచేసారు. అనంతరం వారు మాట్లాడుతూ, వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతోన్న ప్రొద్దుటూరు పట్టణంలో ఫెడరల్ బ్యాంకు ప్రారంభించటం ఎంతో ఆనందదాయకమని, బ్యాంక్ సిబ్బందికి తమ సహాయ సహకారాలు అందిస్తామని భరోశాన్నిచ్చారు.

కార్యక్రమంలో ఆ శాఖ రీజినల్ మేనేజర్ ప్రబోధ్ కుమార్, మేనేజర్, లోకేష్, పలువురు మునిసిపల్ కౌన్సిలర్లు, బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page