top of page

ఫాతిమాషేక్ జయంతిని జయప్రదం చేయండి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 7, 2022
  • 1 min read

ఈ రోజు స్థానిక లలిత కళ సమితిలో యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతదేశ మొట్టమొదటి ముస్లిమ్ మహిళా ఉపాధ్యాయురాలు *ఫాతిమా షేక్* జయంతి కార్యక్రమ నిర్వహణ గురించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆవాజ్ కమిటీ నాయకులు ఇస్మాయిల్,జనసేన నాయకులు అర్షద్, MPJ ఖాసిమ్ మాట్లాడుతూ స్థానిక గాంధీనగర్ లో ఉన్న MPJ కార్యాలయంలో 10 వ తేదీ ఉదయం10.00 గంటలకు ఫాతిమాషేక్ జయంతి కార్యక్రమానికి యస్సీ యస్టీ బిసి మైనార్టీ విద్యార్థి,కుల,ప్రజా సంఘాల నాయకులు ప్రజాస్వామ్యవాదులు పాల్గొని విజయవంతం చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, బిసి నాయకులు శేషఫణి LHPS నాయకులు కైలాష్ నాయక్, రాయలసీమ జనార్దన్, శ్రీధర్ ,మహిళా ఐక్య వేదిక సభ్యులు మాల్య దేవీబాయి, పద్మ, ఎర్రం లక్ష్మీదేవి,శార తదితరులు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page