ఎమ్మెల్యే రాచమల్లు అహంకార ధోరణితో మాట్లాడుతున్నారు - మాజీ ఎమ్మెల్యే వరద
- VOICE OF HERALD

- Oct 12, 2023
- 1 min read
ఎమ్మెల్యే రాచమల్లు అహంకార ధోరణితో మాట్లాడుతున్నారు - మాజీ ఎమ్మెల్యే వరద

కడప జిల్లా, ప్రొద్దుటూరు
బుధవారం ఎమ్మెల్యే రాచమల్లు పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేసి తనపై అహంకార ధోరణితో వ్యవహరిస్తూ మాట్లాడటం సమంజసం కాదని, గతంలో ఎమ్మెల్యే రాచమల్లును ఎన్నోసార్లు తాను పలు కేసుల నుండి కాపాడానని, ఆయనలాగా ఏ రోజు తాను అవినీతికి పాల్పడి, అవినీతిని ప్రోత్సహించి, అవినీతి సొమ్ముకు ఆశ పడలేదని ప్రొద్దుటూరులో వైసిపి పార్టీ నాయకులు చేసే ప్రతి కార్యక్రమం అవినీతి సొమ్ముతో సంపాదించిన డబ్బుతోనే చేస్తున్నారని, ఎమ్మెల్యే రాచమల్లు వెంట నిత్యం క్రికెట్ బుకీలు ఉంటారని, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గురువారం మధ్యాహ్నం ఆయన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.




Comments