top of page

వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 16, 2023
  • 1 min read

వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలి

కడప జిల్లా, ప్రొద్దుటూరు


టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా, త్వరగా విడుదల అవ్వలంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలి నిర్వహించారు. మొదట రామేశ్వరం లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రొద్దుటూరు నుంచి రాజుపాలెం మండలం వెళ్ళాల సంజేవరాయ స్వామి దేవస్థానం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంజేవరాయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి 101 టెంకాయలు కొట్టారు.

రాజకీయ కక్షతోనే చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్ లో ఉంచారని ,ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న కూడా కనీస వసతులు కూడా కల్పించడంలో ప్రభుత్వ అధికారులు విఫలం చెందారని, చంద్రబాబు ను ఇబ్బంది పెడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి విమర్శించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page