top of page

నాకు టికెట్ రావడానికి కారణం ప్రొద్దుటూరు ప్రజలు - టీడీపీ అభ్యర్థి వరద స్పష్ఠీకరణ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 14, 2024
  • 1 min read

నాకు టికెట్ రావడానికి కారణం ప్రొద్దుటూరు ప్రజలు - టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరద స్పష్ఠీకరణ

మాట్లాడుతున్న టిడిపి అభ్యర్థి వరద

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


తనను టిడిపి అభ్యర్థిగా అధిష్టానం గుర్తించటానికి కారణం ప్రొద్దుటూరు ప్రజలేనని, వారికి అలాగే టికెట్ ఖరారు చేసిన అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు లకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ప్రొద్దుటూరు టిడిపి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం నెహ్రూ రోడ్డులోని టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికలలో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి నలుగురు నాయకులు టిడిపి టికెట్ కోసం పోటీ పడగా, టిడిపి నిర్వహించిన సర్వేలలో దాదాపు 72 శాతం మంది ప్రజలు తన అభ్యర్థిత్వాన్ని కోరుతున్నట్లు తెలియచేయగా, సర్వేల ఆధారంగా అధిష్టానం తనకు టికెట్ ఖరారు చేసిందని, మరో నాలుగు రోజులలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను కలుపుకొని వెళ్లి ప్రచారం కొనసాగిస్తామని, నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ, సమిష్టి కృషితో రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చేలా చేస్తామని భరోసా ఇస్తూ, మరో మారు ప్రొద్దుటూరు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే వరద. సమావేశంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page