top of page

ప్రజాస్వామ్య వ్యవస్థలో కక్షపూరిత రాజకీయాలు తగవు - మాజీ ఎమ్మెల్యే వరద

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 29, 2023
  • 1 min read

ప్రజాస్వామ్య వ్యవస్థలు కక్షపూరిత రాజకీయాలు తగవు - మాజీ ఎమ్మెల్యే వరద

నిరసన కార్యక్రమంలో కళ్ళకు గంతలు కట్టుకున్న మాజీ ఎమ్మెల్యే వరద

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రభుత్వానికి కళ్ళు తెరిపిద్దాం, నిజం గెలవాలి, జగన్ చీకటి ప్రభుత్వానికి చరమగీతం పాడాలి అనే నినాదంతో మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపుమేరకు ఆదివారం రాత్రి 7 గంటలకు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి నెహ్రూ రోడ్డులోని తన కార్యాలయం నుండి గాంధీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు కళ్లకు గంతలు కట్టుకొని నిజం గెలవాలి అనే కరపత్రాలు చేతబూని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వానికి చీకటి రోజులు దగ్గరపడ్డాయని, వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో కక్ష పూర్తి రాజకీయాలు తగవని, ప్రజాస్వామ్యంలో శాశ్వతంగా నిలిచేది న్యాయం, ధర్మం, నిజం మాత్రమే అని. ఏనాటికైనా నిజం తప్పకుండా గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ, రానున్న 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి అధికారం చేపడుతుందని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వటం తధ్యమని ఆయన జోష్యం చెప్పారు. కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, వరద అభిమానులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page