top of page

రానున్న ఎన్నికలు బ్యాలెట్ ద్వారా నిర్వహించాలి - మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 14, 2024
  • 1 min read

రానున్న ఎన్నికలు బ్యాలెట్ ద్వారా నిర్వహించాలి


లేనిపక్షంలో తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని స్పష్ఠీకరణ


బ్యాలెట్ ద్వారా ఎన్నికల నిర్వహిస్తే వైసిపి కి 130 నుంచి 140 సీట్లు - మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఈవియం ల ద్వారా అక్రమంగా గెలిచారు తప్ప ప్రజాభిప్రాయం మేరకు గెలవలేదంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఇకపై జరగబోవు ఎన్నికలు బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని లేనిపక్షంలో తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రపంచ దేశాలలో కేవలం 18 దేశాలు మాత్రమే ఈవియం ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నాయని, మిగిలిన చాలా దేశాలు బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికిప్పుడు బ్యాలెట్ ద్వారా ఎన్నికల నిర్వహిస్తే వైసిపి ప్రభుత్వం 130 నుంచి 140 సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే అన్నారు...

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page