top of page

పథకాల అమలులో పారదర్శకత - రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 6, 2022
  • 1 min read

వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు


సోములవారిపల్లె పంచాయతీ పరిధిలోని ఈశ్వర్ రెడ్డి నగర్ నందు మంగళవారం సాయంత్రం పంచాయతీ సర్పంచ్ మోపురి ప్రశాంతి, ఎంపీపీ శేఖర్ యాదవ్, ఎంపీటీసీ గోటూరు వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక ప్రజలు రోడ్డు, డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే రాచమల్లుకు దృష్టికి తీసుకురాగా, పరిష్కార దిశగా తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, పిల్లలకు గర్భిణులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పౌష్ఠికాహారం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల తీరును స్వయంగా లబ్ధిదారులను అడిగి, పథకాల అమలులో పారదర్శకత గురించి వివరించారు.

కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాత కోట బంగారు మునిరెడ్డి. వైసీపీ పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి. వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి. మునిసిపల్ వార్డు కౌన్సిలర్లు భూమి రెడ్డి వంశీదర్ రెడ్డి, కోనేటి సునంద .కమాల్ భాష, వైసిపి నాయకులు ఆచారి కాలనీ శివారెడ్డి. అగ్గరపు శ్రీనివాసులు. రాయపురెడ్డి, రాగా నరసింహులు, మల్లికార్జున యాదవ్, కొండయ్య, రజక సంఘం నాయకులు పన్నీటి కాసయ్య, గజ్జాల కళావతి, పద్మావతి, సచివాలయం సిబ్బంది, కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page